AP: ఏలూరు జిల్లాలోని లింగపాలెం (M) విషాద ఘటన చోటుచేసుకుంది. శివరాత్రి పండుగ వేళ తమ్మిలేరులో స్నానానికి దిగి ఓ ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీటిల్ మునిగి చనిపోయారు. మృతులను తిమ్మపాలెం గ్రామానికి చెందిన మినీయ్య, మారేషులు గా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. రెస్క్యూ చేపట్టి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.