వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ దగ్గర నివాస గృహాల మధ్య నిర్మిస్తున్న ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి పత్రం అందజేశారు. ఇండ్ల మధ్య ఆసుపత్రి నిర్మిస్తే చుట్టు పక్కల ఉన్న ప్రజలకు సమస్యలు వస్తాయని కావున నిర్మాణాన్ని వెంటనే ఆపాలని కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.