ఈ నెల 6వ తేదీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సూచించారు. శనివారం వనపర్తిలో నిర్వహించిన కులగణన సర్వేపై అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సర్వేలో వనపర్తి నియోజకవర్గం రాష్ట్రానికే రోల్డ్ మోడల్ గా నిలవాలని ఆ విధంగా కార్యకర్తలు సర్వే చేపట్టే అధికారులతో మమేకమై సర్వే చేయించాలని ఎమ్మెల్యే సూచించారు.