వనపర్తి జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ

72பார்த்தது
వనపర్తి జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ
వనపర్తి జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నవంబర్ నెల ఆఖరి వరకు 30, 30(ఏ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఎలాంటి ధర్నాలు ర్యాలీలు, నిరసనలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని వెల్లడించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி