వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ నవంబర్ 6 నుండి ప్రారంభమయ్యే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళికలు పకడ్బందీగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్యుమరెటర్ల పనితీరును పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.