వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ యం. నగేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆర్డీఓ కార్యాలయం, కలెక్టరేట్ 33వ రూమ్ లో ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్లను శాశ్వత భవనంలోకి తరలించేందుకు బుధవారం చర్యలు చేపట్టారు. అదే విధంగా రిపేరులో ఉన్న ఒక కంట్రోల్ యూనిట్, 9 వి. వి ప్యాట్లను రిపేరు చేయించే నిమిత్తం హైదరాబాద్ లోని ఈసీఐఎల్ కు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు.