రైతులు, వరి ధాన్యం కొనుగోలు పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ అన్నారు. మంగళవారం నారాయణపేటలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సోమవారం ఎంపీ డికే అరుణతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశిలించామని, ఎక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదని చెప్పారు. సన్న రకం వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు.