లయన్స్ క్లబ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

59பார்த்தது
నారాయణపేట పట్టణంలోని కృష్ణ గోకులం పాఠశాలలో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట టౌన్ 15వ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు, హైజినిక్ కిట్లను అందించారు. నూతన అధ్యక్షుడు రఘుబాబును శాలువాతో సన్మానించారు. సేవలు మరింత విస్తృత పరచాలని ఎమ్మెల్యే అన్నారు.

தொடர்புடைய செய்தி