రైతులకు ప్రభుత్వం అందించే ఫలాలను అందజేస్తామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం తాడూరు సింగిల్ విండో కొత్త భవనాన్ని డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి లతో కలిసి ప్రారంభించారు. రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలకతీతంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.