ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారులను ప్రోత్సహించడానికి ప్రత్యేక సంక్షేమనిధి ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు యం. బాలనర్సింహ డిమాండ్ చేశారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా స్థాయి కళాప్రదర్శనలు నిర్వహించాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన వాగ్దానాలు అమలు చేయాలని కోరారు.