సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరికీ అందేలా చూడాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన దిశా సమీక్ష సమావేశానికి ఎంపీ అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఎటువంటి రాజకీయాలకు తావు ఇవ్వకూడదన్నారు. సంక్షేమ పథకాల అమలులో నిజమైన అర్హులను గుర్తించే బాధ్యత అధికారులదే అని తెలిపారు.