డిసెంబర్ 1 హైదరాబాదులో నిర్వహించే మాలల మహా సంగ్రామ సభను విజయవంతం చేద్దామని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కో-ఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితులంతా ఐక్యమై పోరాడాలన్నారు. అక్టోబర్ 25 న భద్రాచలంలో ప్రారంభమైన మాలల మహా పాదయాత్ర విజయవంతమైందన్నారు.