108 అంబులెన్స్ లో మెడికల్ టెక్నీషియన్ గా ఈ నెల 9న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు బుధవారం జిల్లా మేనేజర్ రవికుమార్ తెలిపారు. బిఎస్సి,బిజెడ్సి, బిఎస్సి-నర్సింగ్, ఏఎన్ఎం, జిఎన్ఎం, బీఫామ్, డిఎంఎల్టి, ఎంఎల్టి ఉత్తీర్ణులు అర్హులని తెలిపారు. 9న ఉ: 10 గంటల నుంచి మ: 3 గంటల వరకు జడ్చర్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలవారు ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలతో రావాలన్నారు.