తెలంగాణ ప్రభుత్వ అధికారిక పర్యటనలో భాగంగా టూరిజంశాఖ నేతృత్వంలో ఈ నెల 5, 6, 7 తేదీలలో లండన్ లో జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో( డబ్ల్యూటీఎం) తెలంగాణ ప్రభుత్వం తరఫున పాల్గొనేందుకు సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మేల్యేలు లండన్ బయలుదేరారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటక రంగంలో పెటుబడులే లక్ష్యంగా యూకే పర్యటన సాగనుంది.