ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎక్కడ అవినీతి జరగకుండా నిఘా పెట్టాల్సిన బాధ్యత మహిళా సంఘాలదేనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ స్థాయి మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఐకేపీ సిబ్బందితో క్యాంప్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో అనర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాకుండా మహిళా సంఘాల సభ్యులు నిఘా పెట్టాలన్నారు.