కేటి దొడ్డి మండలంలో రెండు రోజుల క్రితం ముంత రంగప్ప గుడిసె అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఆదేశాల మేరకు, గద్వాల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి బలిగేర శివారెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని ఆదివారం పరామర్శించి, భవిష్యత్తులో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులకు అవసరమైన నిత్యావసరాలను అందజేశారు.