భార్యతో మాట్లాడుతూనే ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆదివారం నాగర్ కర్నూల్ చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకల్ మండలం పోనకల్ గ్రామానికి చెందిన కొమ్ము వెంకటయ్య(60) భార్య వెంకటమ్మతో కలిసి తాడూరులో దైవదర్శనానికి వెళ్లారు. నాగర్ కర్నూల్ బస్టాండులో భార్యతో మాట్లాడుతూనే మృతి చెందాడు. చనిపోయిన భర్తను హత్తుకుని భార్య విలపించిన దృశ్యం ప్రయాణికులను కంటతడి పెట్టించింది.