మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్ర పరిధిలోని ఐటిఐ అమిస్తాపూర్ మైదానంలో గురువారం రైతు సంబరాలను మంత్రులు ప్రారంభించారు. ఈ వేడుకలలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజ నర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి రైతులు, ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.