మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం 1-టౌన్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం జోగులాంబ జోన్-7 డీఐజీ చౌహాన్ వార్షిక తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులు, కేసుల ప్రగతి, సిబ్బంది పనితీరు, ప్రజలతో సంబంధాలు, శాంతి భద్రతల నిర్వహణ వంటి అంశాలపై డీఐజీ సమీక్షించారు. అదనంగా, సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి విషయాలపై కూడా దృష్టి పెట్టాలని డీజేపీ సూచించారు.