దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన గుట్టపైకి వెళ్లేందుకు ఎలివేటేడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 110 కోట్లు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మంజూరు చేయించారు. ఈ మేరకు గురువారం ఆర్&బి చీఫ్ సెక్రటరీ జీఓను ఎమ్మెల్యేకు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.