హైదరాబాదులోని ధర్నాచౌక్ లో ఆటో డ్రైవర్లు మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కేటీఆర్ తో పాటు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేసిందని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.