ధాన్యం విక్రయాల సమయం కావడంతో సైబర్ నేరగాళ్లు రైతులను అనేక రకాలుగా మోసం చేసే అవకాశం ఉందని, రైతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దేవరకద్ర ఎస్ఐ నాగన్న అన్నారు. గురువారం నాగారం, పెద్దరాజమురు, బొల్లారం, అజిలాపూర్, చిన్నరాజమూరు గ్రామాలలోని రైతులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఎస్ఐ మాట్లాడుతూ.. అపరిచితులు పంపే పిన్/ఓటీపీ, మెస్సేజ్‌లకు రిప్లై ఇవ్వొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏపియం రామన్న, తదితరులు పాల్గొన్నారు.