చెట్టు నరికి ట్రాఫిక్ క్లియర్ చేసిన సీఐ

75பார்த்தது
తాము ఏహోదాలో ఉన్న కొన్ని సందర్భంలో అన్నీ మరిచి సహాయం చేయడానికి పోలీసులు ముందుంటామని ట్రాఫిక్ సిఐ నిరూపించాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం భారీ వర్షానికి అకస్మాత్తుగా చెట్టు కూలింది. తొలగించడానికి మున్సిపల్ శాఖ వారికి పోలీసులు సమాచారం ఇచ్చారు. వారు రావడానికి ఆలస్యం కావడంతో సీఐ భగవంత్ రెడ్డి స్వయంగా రహదారికి అడ్డంగా పడిన చెట్టు కొమ్మలను నరికివేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி