సర్టిఫికెట్లు కోసం కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని మనోపాడ్ తహశీల్దార్ వహీదాను మంగళవారం నారాయణపురం గ్రామానికి చెందిన హైమావతి అనే యువతి నిలదీసింది. ఓబీసీ, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకోగా గంటల పాటు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సర్టిఫికెట్లు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతానని బైఠాయించింది. దీంతో తహశీల్దార్ యువతిని సముదాయించి సర్టిఫికెట్లను జారీ చేశారు.