అచ్చంపేట మండలంలోని లింగోటం గ్రామంలోని ఓ కిరాణ షాపులోకి నాగుపాము జొరబడి కలకలం సృష్టించింది. షాప్ యజమానులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా వారు ఎంపీడీవో ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న స్నేక్యాచారు సుమన్ కు సమాచారం అందించారు. సుమన్ సంఘటన స్థలానికి చేరుకొని నాగుపామును సురక్షితంగా పట్టుకొని, అనంతరం అడవిలో వదిలారు.