ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టిన ఈ నెల 5న ఇందిరాపార్క్ వద్ద జరిగే చలో హైదరాబాద్-మహా ధర్నాను జరిపి తీరుతామని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరంలో ఆంక్షల పేరుతో రేవంత్ సర్కార్.. సమస్యలు చెప్పుకోవడాన్ని కూడా అణచివేస్తుందని బీఆర్‌టీయూ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వేముల మారయ్య విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆటో డ్రైవర్ల ఉపాధిని నాశనం చేసిందని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు.