వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్ రెడ్డి సహా మరికొందరిపై మంగళవారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏపీలో సజ్జల భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో భార్గవ్‌రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.