ఓ భారీ బిల్డింగ్ 12వ అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు కాపాడారు. ఈ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో చోటుచేసుకుంది. ఉద్యోగం పోవడంతో ఓ వ్యక్తి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తన అపార్ట్మెంట్ 12వ అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అతడిని రక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.