TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనపై డీఎస్పీపై ప్రభుత్వం వేటు వేసింది. పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్ల దాడి కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేశారు. ఏ-2గా ఉన్న సురేష్ ఆచూకీ మాత్రం ఇంతవరకు లభించలేదు. అందుకే అతని వెతికి పట్టుకునేందుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.