ఇల్లెందు: చికిత్సపొందుతూ యువకుడి మృతి
ఇల్లెందు మండలంలోని తిలక్ నగర్ కు చెందిన మొగిళి రాజు(23) ఖమ్మంలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. స్థానికంగా ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో పని చేసే రాజు కుటుంబ కలహాల వల్ల క్షణికావేశానికి లోనై శుక్రవారం రాత్రి నిద్ర మాత్రలు మింగాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజు మృతిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.