కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 420 అబద్దాలు చెప్పి అధికారంలోనికి వచ్చిందని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఇల్లెందులో గురువారం జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియతో కలిసి ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు ప్రజలను మభ్యపెడుతూ సంక్షేమ పథకాలను అమలు చేయటంలేదన్నారు.