టేకులపల్లి మండలం బోడు గ్రామంలో నెలకొల్పిన సఖి నాప్కిన్ యూనిట్ ను నిరుద్యోగులైన గిరిజన ఆరుగురు యువతులు, తొమ్మిది లక్షల 90 వేల సబ్సిడీతో 16 లక్షల ఖర్చుతో నిర్మాణం చేపట్టిన నాప్కేన్ యూనిట్ ను మంగళవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పైచదువులు చదివి ఉద్యోగాలు కోసం ఎదురు చూడకుండా స్వస్శక్తితో కుటీర పరిశ్రమ నెలకొల్పుకొని వారి కుటుంబాన్ని పోషించుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించడం సంతోషకరమన్నారు.