తాళ్లగూడెం పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణ పనులని పరిశీలన

969பார்த்தது
తాళ్లగూడెం పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణ పనులని పరిశీలన
ఇల్లందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలం తాళ్లగూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న తాళ్లగూడెం పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణపనులని TSTTF రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆదివారం రోజున మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ తాళ్లగూడెం పెద్దమ్మతల్లి ఎంతో శక్తివంతమైన మహిమలుగల తల్లి అని, ఖమ్మం-ఇల్లందు ప్రధానరహదారి లో ఉండటం అమ్మవారి యొక్క ప్రత్యేకత అని, ఇట్టి దేవాలయాన్ని సందర్శించిన వారికి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా కోరుకున్నవారికి కొంగుబంగారంలాగా అమ్మ వారి చల్లనిచూపు ఉంటుంది అని వారు అన్నారు.

అమ్మవారి దేవాలయనిర్మాణ పనులు వేగంగా నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ఉపసర్పంచ్ పుచ్చకాయల సత్యనారాయణ, MPTC నల్లమోతు లక్ష్మయ్య, దేవాలయనిర్మాణ కమిటీ చైర్మన్-మద్దినేని నరసింహారావు, గ్రామపెద్దలు నల్లమోతు వెంకటనర్సయ్య, అంగడాల నరేష్, నల్లమోతు రవి, నల్లమోతు రంగయ్య, నల్లమోతు నగేష్, పోట్ల రామయ్య, నల్లమోతు రోహిత్, బాలబోయిన వేలాద్రి, గోకర ఉపేందర్, బన్నీ, సాయి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி