అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొమరారం గ్రామ కార్యదర్శి మోతిలాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఇల్లందులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిన్న కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్నను వ్యవసాయ శాఖ అధికారులు కనీసం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.