ఇల్లెందు కోయగూడెం ఉపరితలగనిలో పని చేస్తున్న కార్మికులను కంపెనీ ఇబ్బందులకు గురిచేస్తోందని, ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని టేకులపల్లి రాజకీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం జీఎం కార్యాలయంలో డీవై జీఎం మోహన్ రావుకు వినతిపత్రం అందజేశారు. కోయగూడెం ఓసీ పీవో, ఇల్లెందు డీఎస్పీ కార్యాలయంలోనూ జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు.