తండాలో తాగునీటి సమస్య:పట్టించుకోని అధికారులు

943பார்த்தது
తండాలో తాగునీటి సమస్య:పట్టించుకోని అధికారులు
చిట్టి రామవరం తండాలో తాగునీటి సమస్య కొన్ని సంవత్సరాలుగా వేధిస్తుంది అయినా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు.జిల్లా కేంద్రానికి కూత వేటు దూరం లో ఉన్న ఒక గిరిజన ప్రాంతము దాదాపు 500 కుటుంబాలు,1700మంది జనాభా కలిగిన ఈ గ్రామం లో ఒక బోరుబావి ద్వారా ప్రధానవీధికి ఒకపక్క అక్కడక్కడ కొన్ని పంపు లు వేశారు. అవి కొంతమందికి అర,కొర నీటిని అందిస్తున్నా సమస్య పరిష్కారానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. గత కొన్ని సంవత్సరాలుగా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అధికారులను ,ప్రజా ప్రతినిధులను అభ్యర్ధనలు చేసిన పట్టించు కోవడం లేదని ,ఇకనైనా తమ గ్రామంలో ఏళ్ళుగా వున్న ఈ సమస్యను పరిష్కరించాలని తండావాసులు కోరుతన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி