దుమ్ముగూడెం మండల పరిధిలోని వీరభద్రపురం, కేశవపట్నం ప్రాంతాల్లో సాగవుతున్న పంట పొలాలను ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు సోమవారం సందర్శించారు. వరి, పత్తి మిర్చి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక నీటి కాలువలో పూడిక తీయించాలని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారు.