అశ్వరావుపేట మండల కేంద్రంలో పోలీస్ అధికారులు డాగ్ స్క్వాడ్ తో సోమవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలతో పాటు వివిధ ప్రధానకూడళ్లలో తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా ఎవరైనా కనిపించిన వెంటనే పోలీసులు సమాచారం అందించాలన్నారు. గంజాయి, డ్రగ్స్‌ను రవాణా చేస్తే కఠినచర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ విజయ్ హెచ్చరించారు.