నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఓక లక్ష యాబై వేల రూపాయలతో సబ్ ఇన్స్ స్పెక్టర్ గొల్లపల్లి విజయలక్ష్మి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఐ వసంత కుమార్ తో కలిసి కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేర నియంత్రణ లో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందన్నారు. గ్రామాల్లో ఘర్షణలను సైతం నియంత్రించడంలో సీసీ కెమెరాలు అద్భుత ఫలితాలు వస్తున్నాయన్నారు ప్రతి గ్రామంలో దాతల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఇలా చేయడం వల్ల గ్రామాల్లో నేర నియంత్రణ ను పూర్తిగా అరికట్టవచ్చు అన్నారు.
సీసీ కెమెరాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సర్పంచ్ ఎంపీటీసీ పంచాయతీ కార్యదర్శిని శాలువాతో సత్కరించారు. అనంతరం గ్రామస్తులు అందరు కలిసి డిఎస్పి, సీఐ, ఎస్ఐ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటిన్నారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇస్లావత్ నిరోష, ఉపాసర్పంచ్ కాశీ, నాయకులు బోజ్యా నాయక్, గుగులోత్ బాబు, మాజీ సర్పంచ్ రాములు, గ్రామ ప్రజలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.