చంద్రుగొండ మండలం గానుగపాడు గ్రామానికి చెందిన బరిగడ మధు ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురికావడంతో మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ కు సుమారు లక్షన్నర రూపాయలు ఖర్చు అయ్యాయి. పేద కుటుంబానికి చెందిన మధుకు గానుగపాడు ది బిగినింగ్ యూత్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు స్నేహితులు అందరు కలిసి 32100 మధు కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బిగినింగ్ యూత్ సభ్యులకు గ్రామస్తులకు మధు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గతంలో కరోనా కారణంగా గ్రామంలో ఎంతో మంది ఇబ్బంది పడటంతో ది బిగినింగ్ యూత్ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేయడంలో బిగినింగ్ యూత్ ముందు ఉండటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.