చండ్రుగొండ మండలంలోని బెండలపాడు గ్రామానికి చెందిన గుర్రం రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా అతని కుటుంబానికి ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన ద్వారా రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మంజూరు అయినది. ఆ నగదు మొత్తాన్ని బ్యాంకు మిత్ర ఫజల్ బక్స్ ఆధ్వర్యంలో నామిని గుర్రం సందీప్ కు బ్యాంక్ మేనేజర్ అందజేశారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ. బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సురక్ష భీమ యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా, ఎస్బిఐ జనరల్ బీమా చేయించుకోవడం వలన బీమా చేయించుకున్న వ్యక్తి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ భి సునీల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.