చండ్రుగొండ మండలం గుర్రాయిగూడెంలో పేకాట ఆడుతున్న వ్యక్తులను శనివారం సబ్ఇన్స్పెక్టర్ గొల్లపల్లి విజయలక్ష్మి సిబ్బందితో కలిసి అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేకాట, కోడి పందాలు నిర్వహించే వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.