చండ్రుగొండ మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ జి.సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం రావికంపాడు గ్రామంలో బ్యాంక్ ఖాతాదారులకు మరియు గ్రామస్థులకు బ్యాంక్ సేవలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎడవల్లి వెంకటేశ్వరరావు చే ఇంద్రజాల ప్రదర్శన తో పాటు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాదారులుకు తమ దగ్గర లోని బ్యాంకు మిత్ర (చిన్న గ్రామ శాఖ)వద్ద కొత్త ఖాతాలు తెరవడం నగదు రహిత సేవలు మరియు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అదేవిధంగా నగదు సేవల కొరకు దగ్గరలోని బ్యాంకు మిత్రల వద్దనే నగదు సేవలు పొందాలని తప్పనిసరి పరిస్థితిలో బ్యాంకు దగ్గరకు వచ్చి నగదు తీసుకోవాలని ప్రైవేటు వ్యక్తుల వద్దకు వెళ్లి మోసపోవద్దని వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ యన్. త్రినాథ్ క్యాషియర్ యస్. కె శాన్వాజ్, యస్. సత్యనారాయణ (సత్యం) బ్యాంకు మిత్ర కోడుమూరి తిరుమల రావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.