ఎస్పీఎం కాలుష్యం.. ప్రాణ సంకటం
ఎవ్వరైనా తెల్లవారుజామున నిద్ర లేచేది వాకింగుకు పోయేది ఆరోగ్యం కోసం కాని మా కాగజ్నగర్ లో ఉదయం లేచి వాకింగ్ కు పోయేది అనారోగ్యాన్ని ఫ్రీగా తెచ్చుకోడానికే అని పలువురు వాపోతున్నారు. సోమవారం ఉదయం ఎస్పీఎం క్రీడా మైదానం అంతా కాలుష్యంతో దట్టంగా నిండిపోయి ఉంది. దీంతో చాలా మంది వాకింగ్ చేయకుండానే వెను దిరిగారు. మిల్లు నుండి వెలువడే కాలుష్యం పట్టణవాసులకు ప్రాణ సంకటంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.