అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామపంచాయతీ లోని పోలింగ్ కేంద్రాలు, కాగజ్నగర్ లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి సందర్శించి బూత్ స్థాయి అధికారులకు తగు సూచనలు చేశారు.