రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా శుక్రవారం కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన సీఎం జన్మదిన వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.