వాంకిడి మండల కేంద్రంలోని స్థలంలో హనుమాన్ బస్తీ దగ్గర ఉన్న సర్వే నంబర్ 117 అణువంశిక పట్టభూమి స్థలంలో అక్రమంగా వ్యక్తులు ఇంటి నిర్మాణం చేపట్టారని శనివారం దుర్గం తిరుపతి వాపోయాడు. ఈ సందర్భంగా బాధితుడు తిరుపతి మాట్లాడుతూ ఇందుకు అధికారి అయిన పంచాయతీ కార్యదర్శిని సమాచారం కోరగా తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. పై ఇంటి నిర్మాణం అక్రమంగా కడుతున్న వారిపై కోర్టులో కేసు వుందని కొనసాగుతోందని తెలిపారు.