కాగజ్నగర్ మండలం ఈస్గాం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా మహేందర్ శుక్రవారం తన బాధ్యతలను స్వీకరించారు. కాగజ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించిన ఆయన ఈస్గాం ఎస్ఐగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎటువంటి సమస్యలు ఉన్నా నిస్సందేహంగా తనను సంప్రదించగలరని అన్నారు. అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.