పెంచికల్ పేట్ మండలంలోని చెడ్వాయి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్ గర్ డివిజన్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ కేంద్రానికి ధాన్యాన్ని తీసుకుని వచ్చే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.