బెజ్జూరు మండలంలో ఎస్ఐగా విధులు నిర్వహించిన బి. విక్రమ్ సేవలు అభినందనీయమని ఆదివాసి సంఘం నాయకులు కొనియాడారు. బదిలీపై వెళ్తున్న ఆయనను మంగళవారం ఆదివాసి భవనంలో నాయకులు శాలువాతో సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ. మండలంలో అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ క్రీడాలలో యువకులను ప్రోత్సహిస్తూ అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.